Telugu Times

హసీనా అప్పగింతకు ఇంటర్‌పోల్ సాయం

భారతదేశం నుంచి మాజీ ప్రధాని షేక్ హసీనా రప్పింతకు బంగ్లాదేశ్ ప్రభుత్వం తన విశ్వప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఆమెను తమకు అప్పగించేలా భారత్‌పై ఒత్తిడి తేవాలని బంగ్లా ప్రభుత్వం ఇంటర్‌పోల్ సాయం తీసుకోనుంది. షేక్ హసీనా, ఆమె మంత్రివర్గ సభ్యులు ప్రజా ఉద్యమాల అణచివేత ఇతర నేరాలలో ఎదుర్కొంటున్న కేసులను తమ ప్రభుత్వం ట్రిబ్యునల్ పరిధిలో విచారిస్తుంది, తగు శిక్షలు విధిస్తుందని బంగ్లాదేశ్ ప్రభుత్వ వర్గాలు పేర్కొంటూ వస్తున్నాయి. హసీనా ఫరారీలో ఉన్నారు. మరికొందరు కూడా చట్టానికి దొరకకుండా తప్పించుకుని తిరుగుతున్నారు. వీరిని తమ దేశ దర్యాప్తు సంస్థల పరిధిలో విచారించాల్సిన అవసరం ఉందని, ఈ దిశలో ఇంటర్‌పోల్ సాయం ఖచ్చితంగా తీసుకుంటామని ప్రభుత్వ అధికారులు తెలిపారు.

About The Author

తాజా వార్తలు చదవండి :

Facebook20
Instagram
WhatsApp20