Categories: తెలంగాణ

కురుమూర్తి స్వామి సేవలో సీఎం రేవంత్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్‌నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం అమ్మాపురంలోని శ్రీ కురుమూర్తి స్వామిని దర్శించుకున్నారు. ఉదయం రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్ నుంచి అమ్మాపురం చేరుకున్న రేవంత్ స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు సీఎం రేవంత్‌కు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని బహుకరించారు. సీఎం రేవంత్ వెంట మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దామోదర రాజనర్సింహా ఉన్నారు.దర్శనం కంటే ముందు.. కురుమూర్తి స్వామి దేవాలయానికి సమీపంలో రూ. 110 కోట్లతో చేపట్టనున్న ఆలయ ఘాట్ రోడ్, ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి సీఎం రేవంత్ శంకుస్థాపన చేశారు. మంత్రులతో కలిసి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఏడుకొండల మధ్యలో ఉన్న కాంచనగుహలో కొలువుదీరిన కురుమూర్తి ఆలయానికి చేరుకునేందుకు ప్రస్తుతం సరైన రోడ్డు మార్గం లేదు. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో.. కురుమూర్తి ఆలయానికి ఘాట్ రోడ్డు నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెండ్రోజుల క్రితం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.110 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. దీంతో నేడు ఆలయానికి వచ్చిన సీఎం రేవంత్ పనులు ప్రారంభించారు.

admin

Share
Published by
admin

Recent Posts

ఉత్కంఠ గా సాగుతున్న క్రికెట్ పోటీలు.

శతకం బాదిన ఫర్హాద్ ఖాద్రి. నాలుగు వికెట్లతో పాటు అర్థ సెంచరీ చేసిన ఆల్రౌండర్ జయకృష్ణ అనంతపురం బ్యూరో, టైమ్స్…

2 days ago

మహిళను నమ్మించి మోసం చేసిన వీఆర్వో.

గుంతకల్ , టైమ్స్ న్యూస్: అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణంలో ఓ మహిళను విఆర్ఓ వలి నమ్మించి మోసం చేశారు.…

2 days ago

మౌంటెస్సోరి స్కూల్ పై చర్యలు తీసుకోవాలి : డీఈఓ కు వినతి

కర్నూలు  : అడ్మిషన్స్ కొరకు ఎంట్రెన్స్ పరీక్ష నిర్వహిస్తూ, ఫీజుల దోపిడీ చేస్తున్న మౌంటెస్సోరి, ఇండస్ పాఠశాలపై చర్యలు చూసుకోవాలని…

4 weeks ago

ఏపీ ప్రజలకు ఏప్రిల్ 1 నుంచి సంతోషవార్త.. ఇక నుంచి ఉచితమే కాకపోతే ఒక షరతు…?

ఆంధ్రప్రదేశ్‌లోని పట్టణాల్లో వాణిజ్య సముదాయాలు, మాల్స్‌, మల్టీప్లెక్స్‌ల వద్ద పార్కింగ్ ఫీజులకు సంబంధించి ఏప్రిల్ 1 నుంచి కొత్త నియమం…

4 months ago

జర్నలిస్టులకు ఇంటి స్థలం.. పక్కా ఇళ్లు ఇవ్వాలి

అక్రిడిటేషన్లు తక్షణం మంజూరు చేయాలి హెల్త్ కార్డు.. ఇన్సూరెన్స్ కల్పించాలి ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు కర్నూలు :…

5 months ago

యోగ సాధన చేస్తే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది : డీఈవో శామ్యూల్ పాల్

కర్నూలు : ప్రతి విద్యార్థి క్రమం తప్పకుండా యోగ సాధన చేస్తే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని కర్నూలు  జిల్లా విద్యాశాఖ…

5 months ago