Telugu Times

దొంగ నోట్లు చలామణి ముఠాను అరెస్టు చేసినా పోలీసులు

తిరుపతి జిల్లానగరి నియోజకవర్గంలోని, పుత్తూరులో శనివారం రాత్రి పలు దుకాణాల లో వస్తువులను కొంటూ దొంగ నోట్లును చలామణి చేస్తున్న అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు.తిరుపతి చెర్లోపల్లి సర్కిల్‌ వద్ద నివాసం ఉంటున్న రమేష్‌, అతని భార్య సంధ్య, కూమార్తె ఇషా, వారి స్నేహితుడు మునికృష్టారావు ఇంటిలో పోలీసులు సోదాలు చేయగా వారి వద్ద దొంగనోట్లు ముద్రణకు కావాల్సిన వస్తువులను, ప్రింటర్స్‌, ప్రింట్‌ చేసి కట్‌ చేయడానికి సిద్దంగా ఉన్న 100, 500 నోట్లును స్వాధీనం చేసుకున్నారు.శ్రీకాకుళం జిల్లా కు చెందిన మునికృష్టారావు, రమేష్‌తో పేస్‌ బుక్‌ యాప్‌ ద్వారా పరిచేయం చేసుకుని, తిరుపతిలోని రమేష్‌ ఇంటిలో షేర్‌ మార్కటింగ్‌ బిజినెస్‌ చేసేవారు అయితే భారీ నష్టాలు రావడంతో, యూ ట్యూబ్‌ లో దొంగనోట్లు ముద్రణ చూసి దాని ప్రకారం ఇంటిలోని కుటుంబసభ్యులంతా ముద్రణకు కావాల్సిన వస్తువులను తిరుపతిలో కొని, ఇంటిలో ముద్రించి, వాటిని చుట్టుప్రక్కల ఉన్న తిరుపతి, శ్రీకాళహస్తి, రేణిగుంట, పుత్తూరు వంటి ప్రాంతాలలో వస్తువులను కొంటున్నట్లు మార్పిడి చేసేవారని పుత్తూరు డీఎస్పీ రవికుమార్‌ తెలిపారు.దొంగనోట్లు ముద్రణకు పాల్పడిన నలుగురిన అరెస్టు చేసి, వారు ఉపయోగించినా వస్తువులను, ఒక కారు స్వాధీనం చేసుకుని అదుపులోకి తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

About The Author

తాజా వార్తలు చదవండి :

Facebook20
Instagram
WhatsApp20