{"remix_data":[],"remix_entry_point":"challenges","source_tags":["local"],"origin":"unknown","total_draw_time":0,"total_draw_actions":0,"layers_used":0,"brushes_used":0,"photos_added":0,"total_editor_actions":{},"tools_used":{"border":1,"addons":1},"is_sticker":false,"edited_since_last_sticker_save":true,"containsFTESticker":false}
కర్నూలు జిల్లా ఓర్వకల్లులో 300 ఎకరాల్లో డ్రోన్ హబ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పేర్కొన్నారు. శనివారం సాయంత్రం ఏపీ డ్రోన్ కార్పొరేషన్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కె. దినేష్ కుమార్ జిల్లా కలెక్టర్ గారిని కలిసి ఓర్వకల్లు ప్రాంతంలో ఏర్పాటు చేయనున్న డ్రోన్ హబ్ కు ఎంపిక చేయనున్న భూములపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ర్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ర్ట ప్రభుత్వం ఓర్వకల్లు ప్రాంతంలో 300 ఎకరాల్లో డ్రోన్ హబ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటోందన్నారు.ఇందుకు అవసరమైన భూముల ఎంపికపై డ్రోన్ కార్పొరేషన్ సీఎండీ తో చర్చించామన్నారు. ఓర్వకల్లు మండలం పాలకొలను, కొమరోలు వద్ద డ్రోన్ హబ్ ఏర్పాటుకు అనువైన స్థలాలుగా సూచించామని కలెక్టర్ తెలిపారు. ఓర్వకల్లును డ్రోన్ హబ్‌గా ఏర్పాటును ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోందన్నారు. డ్రోన్ హబ్ ఏర్పాటు వల్ల జిల్లాలో ఎంతో మందికి ఉపాధి ఉద్యోగావకాశాలు లభిస్తాయని కలెక్టర్ తెలిపారు. హబ్ ఏర్పాటుకు కావాల్సిన భూసేకరణ కు తగిన చర్యలు తీసుకుంటున్నామని, ఈ అంశంపై రెవెన్యూ అధికారులకు ఆదేశాలు ఇచ్చామని కలెక్టర్ వివరించారు.
శతకం బాదిన ఫర్హాద్ ఖాద్రి. నాలుగు వికెట్లతో పాటు అర్థ సెంచరీ చేసిన ఆల్రౌండర్ జయకృష్ణ అనంతపురం బ్యూరో, టైమ్స్…
గుంతకల్ , టైమ్స్ న్యూస్: అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణంలో ఓ మహిళను విఆర్ఓ వలి నమ్మించి మోసం చేశారు.…
కర్నూలు : అడ్మిషన్స్ కొరకు ఎంట్రెన్స్ పరీక్ష నిర్వహిస్తూ, ఫీజుల దోపిడీ చేస్తున్న మౌంటెస్సోరి, ఇండస్ పాఠశాలపై చర్యలు చూసుకోవాలని…
ఆంధ్రప్రదేశ్‌లోని పట్టణాల్లో వాణిజ్య సముదాయాలు, మాల్స్, మల్టీప్లెక్స్‌ల వద్ద పార్కింగ్ ఫీజులకు సంబంధించి ఏప్రిల్ 1 నుంచి కొత్త నియమం…
అక్రిడిటేషన్లు తక్షణం మంజూరు చేయాలి హెల్త్ కార్డు.. ఇన్సూరెన్స్ కల్పించాలి ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు కర్నూలు :…
కర్నూలు : ప్రతి విద్యార్థి క్రమం తప్పకుండా యోగ సాధన చేస్తే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని కర్నూలు జిల్లా విద్యాశాఖ…