కర్నూలు నగరంలోని శ్రీ రామ్ నగర్ కాలనీలో ఉన్న శ్రీ చైతన్య పాఠశాలలో చదువుతున్న 24 మంది విద్యార్థులు నాసా ఒమాలయా ప్రాజెక్ట్ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభా చాటారు. అందులో 12 మంది విద్యార్థులు నాసాలో జాతీయ స్థాయిలో రెండవ బహుమతి కైవసం చేసుకున్నారు. జాతీయ నాసా స్థాయిలో రెండవ స్థానంలో ప్రతిభ కనబరచిన విద్యార్థులను ఉద్దేశించి శ్రీ చైతన్య పాఠశాల ఎజిఎం సురేష్ విద్యార్థులకు నాసా వారు పంపిన షీల్డెలను అందచేసి విద్యార్థులను అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులను అంతరీక్ష పరిశోధన రంగంలో విజ్ఞానాభివృద్ధి సాధించడానికి ఇటువంటి నాసా కార్యక్రమాలు ఎంతగానో తోడ్పడతాయని తెలిపారు. కార్యక్రమం లో ముఖ్య అతిధిగా పాఠశాల ఆర్ ఐ వేంకటేశర్లు , ప్రిన్సిపాల్ అన్నపూర్ణమ్మ , కోఆర్డినేటర్ రమణయ్య , అకాడమిక్ డీనే లోకేశ్వర్ రెడ్డి , నాసా ఇంచార్జ్ లావణ్య , ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
