Telugu Times

మౌంటెస్సోరి స్కూల్ పై చర్యలు తీసుకోవాలి : డీఈఓ కు వినతి

కర్నూలు  : అడ్మిషన్స్ కొరకు ఎంట్రెన్స్ పరీక్ష నిర్వహిస్తూ, ఫీజుల దోపిడీ చేస్తున్న మౌంటెస్సోరి, ఇండస్ పాఠశాలపై చర్యలు చూసుకోవాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీ డీ ఎస్ యూ) జిల్లా ఉపాధ్యక్షుడు రమణ కుమార్ డిమాండ్ చేశారు. కర్నూల్ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా విద్యాశాఖ కార్యాలయం నందు డీఈఓ కి శుక్రవారం వినతి పత్రం ఇవ్వడం ఇచ్చారు. అనంతరం వారు మాట్లాడుతూ కర్నూల్ నగరంలో విద్యార్థి తల్లిదండ్రులను మోసం చేస్తూ ధనమే ధ్యేయంగా ఫీజుల దోపిడి చేస్తున్న మౌంటెస్సోరి, ఇండస్ పాఠశాల యజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రతి విద్యార్థికి అడ్మిషన్ ఇవ్వాల్సినటువంటి ప్రైవేట్ విద్యా సంస్థలు నేడు నగరంలో ఎంట్రన్స్ పరీక్ష నిర్వహిస్తూ అడ్మిషన్లు చేసుకుంటూ నర్సరీ, ప్రీ ప్రైమరీ విద్యార్థులకు కూడా పరీక్షల ఒత్తిడి తీసుకొస్తున్న మౌంటెస్సోరి, ఇండస్ పాఠశాలను తక్షణమే సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా పాఠశాలల్లో అంగట్లో సర్కుల్లాగా పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్, బూట్లు, టై లు అమ్ముతూ విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తున్నారని అన్నారు. ఫీజులు విచ్చలవిడిగా వసూలు చేస్తున్నారని అన్నారు. కావున తక్షణమే విద్యాధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నాం. ఈ కార్యక్రమంలో నాయకులు అస్లాం భాష, రవి తదితరులు పాల్గొన్నారు.

About The Author

తాజా వార్తలు చదవండి :

Facebook20
Instagram
WhatsApp20