Telugu Times

జర్నలిస్టులకు ఇంటి స్థలం.. పక్కా ఇళ్లు ఇవ్వాలి

అక్రిడిటేషన్లు తక్షణం మంజూరు చేయాలి
హెల్త్ కార్డు.. ఇన్సూరెన్స్ కల్పించాలి
ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు

కర్నూలు : రాష్ట్రంలో అర్హులైన జర్నలిస్టులకు ఇంటి స్థలం, పక్కా ఇళ్లు ఇవ్వాలని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు డిమాండ్ చేశారు. బుధవారం కర్నూలు నగరంలోని ఎస్టీయూ భవన్లో ఏపీయూడబ్ల్యూజే జిల్లా కమిటీ విస్తృత సమావేశం జిల్లా అధ్యక్షుడు ఈఎన్ రాజు అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిధిగా హాజరైన సుబ్బారావు మాట్లాడుతూ రాష్ట్ర విభజన తరువాత నాటి టీడీపీ ప్రభుత్వం జర్నలిస్టుల పక్కా ఇళ్లు, సంక్షేమం కోసం రూ.100 కోట్లతో ప్రత్యేక నిధి కేటాయించిందని అన్నారు. అమరావతిలో రాష్ట్ర బ్యూరో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుందన్నారు. ఆ తరువాత వచ్చిన జగన్ ప్రభుత్వం ఐదేళ్లు ఐదేళ్లు పట్టించుకోలేదు చివర్లో జర్నలిస్టుల ఇళ్ల పథక కింద 60:40 శాతం ఇళ్ల స్థలాలు కొనుగోలు నిధులు ఇస్తామన్నారు. ఒక్క ఎకరా కొనుగోలు చేయలేదు అన్నారు. మళ్లీ టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఇటీవల సీఎం చంద్రబాబును కలవడం జరిగింది. దీనిపై ఓ కమిటీ వేస్తామని అన్నారు. జర్నలిస్టులకు పింఛన్ స్కీం అమలు చేయాలి, సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలి,ఇంటి స్థలాలు.. పక్కా ఇళ్లు, హెల్త్ కార్డులు, ఇన్సూరెన్స్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర మహాసభల నాటికి ప్రభుత్వం మంజూరు చేయకపోతే ఆందోళన కార్యచరణ తయారు చేస్తామని హెచ్చరించారు. జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఉచిత విద్యా అందించాలని విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ దృష్టికి తీసుకెళ్లామని, సానుకూలంగా స్పందించారని అన్నారు. సంక్షేమ నిధి ఏర్పాటుపై జిల్లా కమిటీ దృష్టి సారించాలన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా యాజమాన్యం కూడా జర్నలిస్టుల సంక్షేమం కోసం పాటుపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ప్రభుత్వం ఇచ్చే ప్రకటనల్లో కొంత మొత్తం జర్నలిస్టుల సంక్షేమానికి కేటాయించాలని డిమాండ్ చేశారు. దీనిపై పోరాటాలకు సిద్ద పడాలని అన్నారు. జర్నలిస్టులు కూడా కుటుంబం, భార్య పిల్లల సంక్షేమం, ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఏపీయూడబ్ల్యూజే జిల్లా గౌరవ సలహాదారులు సుబ్బయ్య, ఐజేయూ అధ్యక్ష, కార్యదర్శులు ఈఎన్ రాజు, శ్రీనివాసులు, ఆర్గనైజింగ్ కార్యదర్శి సుంకన్న, సీనియర్ జర్నలిస్టు హరికిషన్ తదితరులు మాట్లాడారు. అనంతరం రాష్ట్ర ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షుడిగా రెండవ పర్యాయం ఏకగ్రీవంగా ఎన్నికైన ఐవీ సుబ్బారావును ఘనంగా సత్కరించారు. అలాగే.. రాష్ట్ర సమితి సభ్యులుగా ఎన్నికైన దేవేంద్ర, భీమన్న, మధులను సన్మానించారు. కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా కోశాధికారి అంజి, ఉపాధ్యక్షులు, సహాయ కార్యదర్శులు శివ, స్వరూప్, నూర్, గిరి, ఎమ్మిగనూరు, మంత్రాలయం, పత్తికొండ అధ్యక్షులు శ్రీనివాసులు, పరమేశ్ జయరాజ్,సాలురంగడు తదితరులు పాల్గొన్నారు.

ఎలక్ట్రానిక్ మీడియా హడహక్ కమిటి కన్వీనర్ గా హరికిషన్

ఆంధ్ర ప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ కర్నూలు జిల్లా అడహాక్ కమిటీ కన్వీనర్ గా సీనియర్ జర్నలిస్టు హరికిషన్ ను రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు ప్రకటించారు. సభ్యులుగా సీనియర్ జర్నలిస్టులు మధు, సుంకన్న, శివలను ఎన్నుకున్నారు. ఈ కమిటీ జిల్లాలో పర్యటించి ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల అసోసియేషన్ కమిటీలు ఏర్పాటు చేయాలని, త్వరలోనే జిల్లా కమిటీ కూడా ఏర్పాటు చేయాలని సూచించారు.

దివంగత చిన్నకు ఘన నివాళి : ఇటీవల గుడెపోటుకు గురై హఠాన్మరణం చెందిన ఏబీఎన్ స్టాఫ్ కెమెరామెన్ జె. సురేంద్రబాబు (చిన్న)కు ఘనంగా నివాళులు అర్పించారు. చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళి అందించారు. చిన్న, ఇటివల గుండెపోటుతో మరణించిన విశాలాంధ్ర రిపోర్టర్ హనుమంతన్నల సేవలు కొనియాడారు. అనంతరం ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు, ఐజేయూ జాతీయ సమితి సభ్యులు నాగరాజు తదితరులు చిన్న కుటుంబం సభ్యులను పరామర్శించారు.

About The Author

తాజా వార్తలు చదవండి :

Facebook20
Instagram
WhatsApp20