ఈ నెల 5వ తేదీన నిర్వహించిన ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన 12 సంవత్సరాల ఉపాధ్యాయ వృత్తిని తృణ ప్రాయంగా వదిలేసి ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్( పి డి ఎఫ్ ) అభ్యర్థిగా పోటీ చేసిన యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి కామ్రేడ్ టి గోపీ మూర్తి ఎమ్మెల్సీ గా ఎన్నిక కావడం పట్ల యుటిఎఫ్ నాయకులు గురువారం హర్షం వ్యక్తం చేస్తూ పాత్రికేయ ప్రకటనల విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత సంవత్సరం డిసెంబర్ 15వ తేదీన అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న సమ్మెకు మద్దతుగా పాల్గొని తిరిగి వస్తున్న సమయంలో ఘోర రోడ్డు ప్రమాదానికి గురై మరణించిన దివంగత ఎమ్మెల్సీ కామ్రేడ్ షేక్ సాబ్జీ స్థానంలో ఈ ఎన్నిక అనివార్యమైందని, అయితే ఉపాధ్యాయ సంఘాలుగా ఏకం కావాల్సింది పోయి 17 ఉపాధ్యాయ సంఘాలు విడి పడి పోటీ చేయడం జరిగిందని అయితే పి డి ఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలిచిన కామ్రేడ్ గోపి మూర్తి మొదటి ప్రాధాన్యత ఓటు తోనే గెలిచారని హర్షం వ్యక్తం చేశారు.
శతకం బాదిన ఫర్హాద్ ఖాద్రి. నాలుగు వికెట్లతో పాటు అర్థ సెంచరీ చేసిన ఆల్రౌండర్ జయకృష్ణ అనంతపురం బ్యూరో, టైమ్స్…
గుంతకల్ , టైమ్స్ న్యూస్: అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణంలో ఓ మహిళను విఆర్ఓ వలి నమ్మించి మోసం చేశారు.…
కర్నూలు : అడ్మిషన్స్ కొరకు ఎంట్రెన్స్ పరీక్ష నిర్వహిస్తూ, ఫీజుల దోపిడీ చేస్తున్న మౌంటెస్సోరి, ఇండస్ పాఠశాలపై చర్యలు చూసుకోవాలని…
ఆంధ్రప్రదేశ్‌లోని పట్టణాల్లో వాణిజ్య సముదాయాలు, మాల్స్, మల్టీప్లెక్స్‌ల వద్ద పార్కింగ్ ఫీజులకు సంబంధించి ఏప్రిల్ 1 నుంచి కొత్త నియమం…
అక్రిడిటేషన్లు తక్షణం మంజూరు చేయాలి హెల్త్ కార్డు.. ఇన్సూరెన్స్ కల్పించాలి ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు కర్నూలు :…
కర్నూలు : ప్రతి విద్యార్థి క్రమం తప్పకుండా యోగ సాధన చేస్తే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని కర్నూలు జిల్లా విద్యాశాఖ…