ఈ నెల 5వ తేదీన నిర్వహించిన ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన 12 సంవత్సరాల ఉపాధ్యాయ వృత్తిని తృణ ప్రాయంగా వదిలేసి ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్( పి డి ఎఫ్ ) అభ్యర్థిగా పోటీ చేసిన యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి కామ్రేడ్ టి గోపీ మూర్తి ఎమ్మెల్సీ గా ఎన్నిక కావడం పట్ల యుటిఎఫ్ నాయకులు గురువారం హర్షం వ్యక్తం చేస్తూ పాత్రికేయ ప్రకటనల విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత సంవత్సరం డిసెంబర్ 15వ తేదీన అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న సమ్మెకు మద్దతుగా పాల్గొని తిరిగి వస్తున్న సమయంలో ఘోర రోడ్డు ప్రమాదానికి గురై మరణించిన దివంగత ఎమ్మెల్సీ కామ్రేడ్ షేక్ సాబ్జీ స్థానంలో ఈ ఎన్నిక అనివార్యమైందని, అయితే ఉపాధ్యాయ సంఘాలుగా ఏకం కావాల్సింది పోయి 17 ఉపాధ్యాయ సంఘాలు విడి పడి పోటీ చేయడం జరిగిందని అయితే పి డి ఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలిచిన కామ్రేడ్ గోపి మూర్తి మొదటి ప్రాధాన్యత ఓటు తోనే గెలిచారని హర్షం వ్యక్తం చేశారు. హర్షం వ్యక్తం చేసిన వారిలో యుటిఎఫ్ జిల్లా సహాధ్యక్షులు శ్రీమతి శాంతి ప్రియ,జిల్లా కార్యదర్శి నరసింహారెడ్డి,జిల్లా కౌన్సిల్ సభ్యులు అబ్దుల్ లతీఫ్,మండల అధ్యక్షులు రమేష్ నాయుడు,మండల గౌరవాధ్యక్షులు శేషయ్య,మండల సీనియర్ నాయకులు బొజ్జన్న,జిల్లా కౌన్సిల్ సభ్యులు చంద్ర మోహన్, అంజనప్ప,మండల సహాధ్యక్షులు ఆంజనేయ ప్రసాద్,నాగమణి,ఆర్థిక కార్యదర్శి మధు,సర్వజ్ఞ మూర్తి,రాజేంద్ర,సాలయ్య,కృష్ణా నాయక్ ఉన్నారు.
