Telugu Times

ఉత్కంఠ గా సాగుతున్న క్రికెట్ పోటీలు.

శతకం బాదిన ఫర్హాద్ ఖాద్రి.

నాలుగు వికెట్లతో పాటు అర్థ సెంచరీ చేసిన ఆల్రౌండర్ జయకృష్ణ

అనంతపురం బ్యూరో, టైమ్స్ న్యూస్: అనంతలో క్రికెట్ పోటీలు ఉత్కంటభరితంగా సాగుతున్నాయి. నువ్వా నేనా అన్న పోటీతత్వంతో క్రీడాకారులు తమ ప్రతిభను కనబరుస్తున్నారు. అనంతపురం నెల్లూరు మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్లు అధ్యంతం ఆసక్తి రేపుతున్నాయి. అనంతపురం నెల్లూరు ఏ సి ఏ సీనియర్ మెన్ మల్టీ డే ఇంటర్నెట్ డిస్ట్రిక్ట్ మ్యాచ్ లు క్రికెట్ అభిమానులకు కనువిందు చేస్తున్నాయి.
తొలి ఇన్నింగ్స్ లో అనంత జట్టు ఆదిక్యం సాధించింది.
ఆల్ రౌండ్ జై కృష్ణ 50 పరుగులు సాధించి జట్టు ఆశలను సజీవం చేశారు. మరోవైపు సెంచరీ తో ఫర్హాద్ ఖాద్రి చెలరేగిపోయాడు.

ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అనంతపురంలో జరుగుతున్న సీనియర్ మెన్ నాలుగో రౌండ్ మల్టీ డే క్రికెట్ పోటీల్లో అనంతపురం నెల్లూరు జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ ఆసక్తిని రేపుతోంది .ఈ పోటీల్లో విజేతగా నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో అనంతపురం జట్టు పోరాడుతుంది. తొలి ఇన్నింగ్స్ లో 237 పరుగులకు ఆల్ అవుట్ అయిన నెల్లూరుకు జవాబుగా అనంతపురం జట్టు కీలకమైన తొలి ఇన్నింగ్స్ ఆదిక్యం సాధించింది . తొలి ఇన్నింగ్స్ ఆదిక్యం సాధించడంలో అనంతపురం జట్టు ఆల్రౌండర్లు జై కృష్ణ ,బి ఎస్ వినయ్ కుమార్ కీలక పాత్ర పోషించారు. కష్టతరమైన బ్యాటింగ్ పరిస్థితుల్లో వీరిద్దరూ కీలకమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో జట్టు ఆశలు సజీవమయ్యాయి. అద్భుతమైన పోరాట ప్రతిభ కనబరిచిన జై కృష్ణ అర్థ సెంచరీ సాధించగా, జై కృష్ణకు మార్గ నిర్దేశం చేసిన కెప్టెన్ వినయ్ కుమార్ కీలకమైన నలభై పరుగులు సాధించాడు. సెలక్టర్లు, జట్టు కెప్టెన్ మరియు సీనియర్ సభ్యులు తన పై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్న జై కృష్ణ నాలుగు వికెట్లు తీయడమే కాకుండా కీలకమైన తొలి ఇన్నింగ్స్ లో ఆదిక్యం సాధించడంలో కీలక భూమిక పోషించి క్రికెట్ అభిమానుల అభిమానాన్ని పొందారు . తొలి ఇన్నింగ్స్ ఆదిక్యం కోల్పోయిన నెల్లూరు జట్టు తమ రెండో ఇన్నింగ్స్ లో వన్డే తరహా ఆట తీరును ప్రదర్శిస్తుంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి కేవలం 53 ఓవర్లలో 245 పరుగులు చేసి ఐదు వికెట్లు కోల్పోయింది. జట్టు బ్యాట్స్మెన్ ఫర్హాద్ ఖాద్రి , రోషన్ పవన్ కుమార్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ఫర్హాద్ ఖాదరి 118 బంతుల్లో 111 పరుగులు సాధించగా, రోషన్ పవన్ కుమార్ 104 బంతుల్లో 71 పరుగులు సాధించారు.
ఈ అంచె పోటీల్లో విజేతగా నిలవాలంటే అనంతపురం జట్టు ఈ మ్యాచ్ లో అవుట్రేట్ విజయం సాధించడంతోపాటు నెట్ రన్ రేట్ భారీగా పెంచుకోవలసి ఉంటుంది. నాలుగు మ్యాచ్ల్లు ఆడిన చిత్తూరు జట్టు 16 పాయింట్లు సాధించడం తోపాటు మెరుగైన రన్ రేట్ తో ప్రస్తుతం టాప్ పొజిషన్లో కొనసాగుతోంది. బుధవారం ఈ పోటీలకు ఆఖరి రోజు.

About The Author

తాజా వార్తలు చదవండి :

Facebook20
Instagram
WhatsApp20