గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని పి ఆర్ ఆర్ ఎంబీఏ కళాశాల విద్యార్థులు ఎస్కేయూ లో నిర్వహించినటువంటి క్రీడలలో పాల్గొని అథ్లెటిక్ మెన్ ఛాంపియన్షిప్ సాధించారు. పెనుగొండ పరిధిలో నిడిమామిడి జడ్పీహెచ్ స్కూల్ రికార్డ్ అసిస్టెంట్ పవన్ కుమార్ , కృష్ణవేణి దంపతుల కుమారుడు పి ఆర్ ఆర్ ఎం బి ఏ కళాశాలలో ద్వితీయ సంవత్సరం అభ్యసిస్తున్న జై సాయి సుభాష్ రెండు గోల్డ్ మెడల్స్ రెండు సిల్వర్ మెడల్స్ ను ఒక బ్రోంజ్ ఏకంగా ఐదు మెడల్స్, అథ్లెటిక్ ఛాంపియన్షిప్ సాధించడం జరిగినది . అదేవిధంగా ఇదే కళాశాలకు చెందినటువంటి మొదటి సంవత్సరం విద్యార్థిని త్రివేణి క్రీడలలో పాల్గొని జవిలిన్ బ్రోంజ్ మెడల్ సాధించింది . ఈ సందర్భంగా పిఆర్ఆర్ ఎంబీఏ కళాశాల యాజమాన్యం పల్లె వెంకట కృష్ణ కిషోర్ రెడ్డి, క్యాంపస్ ఇంచార్జ్ సంతోష్ కుమార్ రెడ్డి విద్యార్థులను అభినందించడం జరిగినది. ఈ సందర్భంగా కళాశాల నందు క్రీడల్లో ప్రతిభ కనబరిచిన జై సాయి శుభాష్ కు పి ఆర్ ఆర్ ఎంబీఏ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రసన్న కుమార్ ఆధ్వర్యంలో అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన శ్రీ సాయి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వెంకటేశ్వర్లు రెడ్డి మాట్లాడుతూ చదువుతోపాటు క్రీడలు కూడా చాలా అవసరం అని క్రీడారంగం వైపు ప్రతిభ కలిగిన విద్యార్థులకు, తమ సహకారం ఉంటుందని, విద్యార్థులకు ప్రభుత్వ రంగాలలో స్పోర్ట్స్ కోటా ద్వారా ఉద్యోగం పొందే అవకాశం కూడా ఉంటుందని తెలపడం జరిగింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ విద్యార్థులకు క్రీడలు చాలా అవసరం అని మహోన్నత స్థాయి కూడా క్రీడలు ఒక వ్యక్తిని తీసుకుపోయే కలిగే సత్తా ఉంది అని విద్యను ఒకవైపు క్రీడను ఒకవైపు రెండు కల్లులా విద్యార్థులు చూసుకోవాలని, మెడల్స్ సాధించినటువంటి విద్యార్థిని విద్యార్థులకు మరెన్నో విజయాలు సాధించాలని పిలుపునివ్వడం జరిగినది. అనంతరం జై సాయి సుభాష్ ను శాలువాతో సన్మానం చేయడం జరిగినది. ఈ సందర్భంగా క్రీడాకారుడు జై సాయి సుభాష్ మాట్లాడుతూ విద్యార్థులలో క్రీడా స్ఫూర్తి కలిగి ఉండాలని క్రీడలు మానసిక ఆనందాన్ని ఇస్తుందని అదేవిధంగా క్రీడారంగంలో మంచి ఉన్నత స్థాయికి రావాలని పిలుపునివ్వడం జరిగింది.
శతకం బాదిన ఫర్హాద్ ఖాద్రి. నాలుగు వికెట్లతో పాటు అర్థ సెంచరీ చేసిన ఆల్రౌండర్ జయకృష్ణ అనంతపురం బ్యూరో, టైమ్స్…
గుంతకల్ , టైమ్స్ న్యూస్: అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణంలో ఓ మహిళను విఆర్ఓ వలి నమ్మించి మోసం చేశారు.…
కర్నూలు : అడ్మిషన్స్ కొరకు ఎంట్రెన్స్ పరీక్ష నిర్వహిస్తూ, ఫీజుల దోపిడీ చేస్తున్న మౌంటెస్సోరి, ఇండస్ పాఠశాలపై చర్యలు చూసుకోవాలని…
ఆంధ్రప్రదేశ్‌లోని పట్టణాల్లో వాణిజ్య సముదాయాలు, మాల్స్, మల్టీప్లెక్స్‌ల వద్ద పార్కింగ్ ఫీజులకు సంబంధించి ఏప్రిల్ 1 నుంచి కొత్త నియమం…
అక్రిడిటేషన్లు తక్షణం మంజూరు చేయాలి హెల్త్ కార్డు.. ఇన్సూరెన్స్ కల్పించాలి ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు కర్నూలు :…
కర్నూలు : ప్రతి విద్యార్థి క్రమం తప్పకుండా యోగ సాధన చేస్తే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని కర్నూలు జిల్లా విద్యాశాఖ…