Telugu Times

అజ్ఞాతంలోకి నటి కస్తూరి

తెలుగువారిని కించపరిచే విధంగా మాట్లాడారనే ఫిర్యాదులతో టీవీ నటి కస్తూరిపై పలు కేసులు నమోదు అయ్యాయి. ఆమె అరెస్టు కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఎక్కడున్నా అరెస్టుకు సమన్లు వెలువడ్డాయి. అయితే ప్రస్తుతం ఎక్కడుందనేది తెలియడం లేదు. సెల్ ఫోన్ కూడా స్విచ్చాఫ్ ఉంటూ వచ్చింది. చెన్నైలోని ఆమె ఇంటికి తాళం వేసి ఉంది. ఆంధ్ర ప్రాంతం నుంచి శతాబ్దాల క్రితం తెలుగువారు తమిళనాడులో రాజుల వద్ద అంతఃపుర కాంతలకు సేవ చేయడానికి కూలీలుగా వచ్చారని మాటల సందర్భంలో కస్తూరి వ్యాఖ్యానించారనేది వివాదాస్పదం అయింది. అయితే తెలుగువారిని తాను కించపర్చలేదని, నొప్పించి ఉంటే క్షమించాలని కూడా కస్తూరి తరఫున తరువాత ప్రకటన వెలువడింది. ఇప్పుడు ఆమె అరెస్టుకు పోలీసు బృందాలు రంగంలోకి దిగడం, ఆమె అజ్ఞాతంలోకి వెళ్లడం కీలక చర్చకు దారితీసింది.

About The Author

తాజా వార్తలు చదవండి :

Facebook20
Instagram
WhatsApp20