ఈ నెల 5వ తేదీన నిర్వహించిన ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన 12 సంవత్సరాల ఉపాధ్యాయ వృత్తిని తృణ ప్రాయంగా వదిలేసి ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్( పి డి ఎఫ్ ) అభ్యర్థిగా పోటీ చేసిన యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి కామ్రేడ్ టి గోపీ మూర్తి ఎమ్మెల్సీ గా ఎన్నిక కావడం పట్ల యుటిఎఫ్ నాయకులు గురువారం హర్షం వ్యక్తం చేస్తూ పాత్రికేయ ప్రకటనల విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత సంవత్సరం డిసెంబర్ 15వ తేదీన అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న సమ్మెకు మద్దతుగా పాల్గొని తిరిగి వస్తున్న సమయంలో ఘోర రోడ్డు ప్రమాదానికి గురై మరణించిన దివంగత ఎమ్మెల్సీ కామ్రేడ్ షేక్ సాబ్జీ స్థానంలో ఈ ఎన్నిక అనివార్యమైందని, అయితే ఉపాధ్యాయ సంఘాలుగా ఏకం కావాల్సింది పోయి 17 ఉపాధ్యాయ సంఘాలు విడి పడి పోటీ చేయడం జరిగిందని అయితే పి డి ఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలిచిన కామ్రేడ్ గోపి మూర్తి మొదటి ప్రాధాన్యత ఓటు తోనే గెలిచారని హర్షం వ్యక్తం చేశారు.
ఉమ్మడి కర్నూలు జిల్లాలో గ్రీన్ కో సంస్థ నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ (ఐ.ఆర్.ఇ.పి.) మన దేశానికే తలమానికమైన…
గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని పి ఆర్ ఆర్ ఎంబీఏ కళాశాల విద్యార్థులు ఎస్కేయూ లో నిర్వహించినటువంటి క్రీడలలో పాల్గొని అథ్లెటిక్…
కర్ణాటకలో పవర్ షేరింగ్ వ్యవహారం మరోసారి తెరపైకొచ్చింది. ఇటు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.. అటు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వ్యాఖ్యలతో…
గ్కేబెర్హా: సౌతాఫ్రికాతో ఆదివారం జరిగే రెండో టి20 మ్యాచ్‌కు టీమిండియా సమరోత్సాహంతో సిద్ధమైంది. ఇప్పటికే తొలి టి20లో గెలిచి జోరుమీదున్న…
బంగారం ధరలు రోజురోజుకి పెరుగుతూనే ఉంటాయి. ఒకసారి ధరలు పెరుగుతే మరోసారి తగ్గుతాయి. దీపావళి పండుగ సందర్బంగా కూడా బంగారం…
తెలుగువారిని కించపరిచే విధంగా మాట్లాడారనే ఫిర్యాదులతో టీవీ నటి కస్తూరిపై పలు కేసులు నమోదు అయ్యాయి. ఆమె అరెస్టు కోసం…