Categories: తెలంగాణ

కురుమూర్తి స్వామి సేవలో సీఎం రేవంత్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్‌నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం అమ్మాపురంలోని శ్రీ కురుమూర్తి స్వామిని దర్శించుకున్నారు. ఉదయం రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్ నుంచి అమ్మాపురం చేరుకున్న రేవంత్ స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు సీఎం రేవంత్‌కు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని బహుకరించారు. సీఎం రేవంత్ వెంట మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దామోదర రాజనర్సింహా ఉన్నారు.దర్శనం కంటే ముందు.. కురుమూర్తి స్వామి దేవాలయానికి సమీపంలో రూ. 110 కోట్లతో చేపట్టనున్న ఆలయ ఘాట్ రోడ్, ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి సీఎం రేవంత్ శంకుస్థాపన చేశారు. మంత్రులతో కలిసి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఏడుకొండల మధ్యలో ఉన్న కాంచనగుహలో కొలువుదీరిన కురుమూర్తి ఆలయానికి చేరుకునేందుకు ప్రస్తుతం సరైన రోడ్డు మార్గం లేదు. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో.. కురుమూర్తి ఆలయానికి ఘాట్ రోడ్డు నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెండ్రోజుల క్రితం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.110 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. దీంతో నేడు ఆలయానికి వచ్చిన సీఎం రేవంత్ పనులు ప్రారంభించారు.

admin

Share
Published by
admin

Recent Posts

దేశానికే తలమానికం ఇంటిగ్రేటెడ్ రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ : పవన్ కళ్యాణ్

ఉమ్మడి కర్నూలు జిల్లాలో గ్రీన్ కో సంస్థ నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ (ఐ.ఆర్.ఇ.పి.) మన దేశానికే తలమానికమైన…

2 weeks ago

అథ్లెటిక్ మెన్ ఛాంపియన్షిప్ సాధించిన.. పి ఆర్ ఆర్ విద్యార్థికి సన్మానం

గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని పి ఆర్ ఆర్ ఎంబీఏ కళాశాల విద్యార్థులు ఎస్కేయూ లో నిర్వహించినటువంటి క్రీడలలో పాల్గొని అథ్లెటిక్…

1 month ago

గోపీ మూర్తి ఎమ్మెల్సీ ఎన్నిక పై యుటిఎఫ్ హర్షం

ఈ నెల 5వ తేదీన నిర్వహించిన ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన 12 సంవత్సరాల ఉపాధ్యాయ…

1 month ago

కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య టైమ్‌…? నెక్ట్స్ సీఎం ఎవరు..?

కర్ణాటకలో పవర్‌ షేరింగ్‌ వ్యవహారం మరోసారి తెరపైకొచ్చింది. ఇటు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.. అటు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ వ్యాఖ్యలతో…

2 months ago

నేడు సౌతాఫ్రికా-భారత్ రెండో టీ20..

గ్కేబెర్హా: సౌతాఫ్రికాతో ఆదివారం జరిగే రెండో టి20 మ్యాచ్‌కు టీమిండియా సమరోత్సాహంతో సిద్ధమైంది. ఇప్పటికే తొలి టి20లో గెలిచి జోరుమీదున్న…

2 months ago

భారీగా పెరిగిన బంగారం ధరలు..లేటెస్ట్ రేట్స్ ఇవే..

బంగారం ధరలు రోజురోజుకి పెరుగుతూనే ఉంటాయి. ఒకసారి ధరలు పెరుగుతే మరోసారి తగ్గుతాయి. దీపావళి పండుగ సందర్బంగా కూడా బంగారం…

2 months ago